బీజేపీలో చేరేవారికి ఉండవల్లి కీలక సూచన

UPDATED 22nd DECEMBER 2020 TUESDAY 9:00 PM

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్): బీజేపీలో చేరే వారికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక సూచన చేశారు. బీజేపీ అన్ని పార్టీల లాంటిది కాదని, ఆ పార్టీకి ఒక ఐడియాలజీ ఉందని అరుణ్‌కుమార్ అన్నారు. సోషలిస్టులకు బీజేపీ చాలా వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగే గొడవ క్యాప్టలిస్టులకు, సోషలిస్టులకని ఆయన విశ్లేషించారు. బీజేపీలో చేరాలనుకునే వాళ్లు వాస్తవం తెలుసుకోవాలని సూచించారు. పదవులు కోసం పార్టీలో చేరకూడదని, మాజీ ప్రధాని వాజ్‌పాయి, అద్వానీ వంటి నేతలకు ఆర్ఎస్ఎస్ ఎలా చెక్ పెట్టిందో తెలుసుకోవాలని అరుణ్‌కుమార్ హితవు పలికారు. ‌నగరంలో పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు విషయాలు తెలిపారు. ప్రాజెక్టు విషయంలో అలసత్వం కూడదని, కేంద్రంతో రాజీ పడటం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. డీపీఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిందేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. పునరావాస ప్యాకేజీపై నిధులపై రాజీపడితే రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసినవారవుతారన్నారు. ఒకసారి నీళ్లు వచ్చాక ఎత్తు పెంచారా లేదా అని ఎవరూ పట్టించుకోరని చెప్పారు. ఆ నీళ్లు అయిపోయాక అప్పుడు రోడ్లమీదకు జనం వస్తారని, అప్పటికి జరగాల్సింది జరిగిపోతుందన్నారు. పోలవరంపై పోరాడాల్సిందేనన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us