AP Politics: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్.. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు

Updated 9th September 2023 Saturday 6:40 am

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న ఆయన బస చేసి బస్సు నుంచి కిందకు రాగానే సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బాబును సిట్, సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని విజయవాడకు తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐతే.. తన అరెస్టుకు కారణం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైమా ఫేసీ లేకుండా అరెస్టు చెయ్యడానికి ఏం అధికారం ఉంది అని ప్రశ్నించారు.

శుక్రవారం అర్థరాత్రి నుంచే నంద్యాలలో హడావుడి కనిపించింది. టీడీపీ అగ్రనాయకత్వం నుంచి జిల్లా నాయకులందరికీ ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి. ఏ క్షణమైనా.. ఏదైనా జరగొచ్చనే సంకేతాలు వెళ్లాయి. అందుకు తగ్గట్లుగానే.. నంద్యాల ఎస్పీ ఆఫీసుకు భారీగా పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి ఆరు బస్సుల్లో బలగాలు దిగాయి. ఎస్పీ కార్యాలయం నుంచి చంద్రబాబు బస చేస్తున్న ఆర్.కే ఫంక్షన్‌ హాల్‌కు భారీ బలగాలతో పోలీసు అధికారులు వచ్చారు.

చంద్రబాబు రెస్టు తీసుకుంటున్న బస్సు డోర్‌ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులను అడ్డుకున్నారు. అర్థరాత్రి మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు బస చేస్తున్న ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపాలని పోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబుకు తప్ప ఎవ్వరికీ సమాధానం చెప్పమని చెప్పడంతో.. నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఏ కేసు విషయంలో వచ్చారో కూడా చెప్పలేదు. ఉదయం వస్తే తామే చంద్రబాబును కలిసే ఏర్పాటు చేస్తామని పోలీసులకు తేల్చిచెప్పారు.

2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌- సీమెన్స్‌ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,356 కోట్ల రూపాయలు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం ఉంది. 371 కోట్ల రూపాయలు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చి నేపథ్యంలో.. వైపీసీ నేతృత్వంలోని ప్రభుత్వం 2020 ఆగస్టులో విచారణకు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిగింది. 2020 డిసెంబరు 10న విజిలెన్స్‌ విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది. 2021 డిసెంబర్‌ 9న ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us