కట్టమూరులో ఉద్రిక్తత... పోలీసులపై రాళ్ళ దాడి

UPDATED 1st FEBRUARY 2026 7:00 PM

సిఐ, కానిస్టేబుళ్ళకు గాయాలు

దేవస్థానం అధికారులపై చర్యలకు గ్రామస్తులు డిమాండ్

పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, ఫిబ్రవరి 1: పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో శ్రీ కేశవ పట్టాభిరామ స్వామి వారి దేవస్థానం (జోడుగుళ్ళు) వద్ద శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్దాపురం సిఐ పి. విజయ్ శంకర్, కానిస్టేబుళ్ళపై కొందరు యువకులు రాళ్ళతో దాడి చేశారు.

అసలేం జరిగిందంటే....

కట్టమూరు గ్రామంలోని శ్రీ కేశవ పట్టాభిరామ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు గత నెల 28 నుంచి జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆలయ ప్రాంగణంలో దేవస్థానం అధికారులు సాంఘిక నాటకం ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించి గ్రామాల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పల్లెనిద్ర కార్యక్రమాన్ని అదేరోజు గ్రామంలో నిర్వహించింది.  ఇంతలో గ్రామంలోని జోడుగుళ్ళు వద్ద సాంఘిక నాటకం పేరుతో అశ్లీల నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయని సిఐ సమాచారం అందుకున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల పవిత్రత దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో సిఐ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకుని నాటకాన్ని నిలిపివేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు యువకులు సిఐ, పోలీస్ సిబ్బందిపై రాళ్ళతో దాడికి పాల్పడడంతో వారు గాయాలపాలయ్యారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలోపడ్డారు. అలాగే పవిత్రమైన ఉత్సవాల వేళ అశ్లీల ప్రదర్శనలు ప్రోత్సహించి గ్రామ వాతావరణాన్ని దెబ్బతీసిన దేవస్థానం అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us