Kandrakota Nookalamma: శాకంబరి అలంకారంలో నూకాలమ్మ

UPDATED 13th JULY 2025 SUNDAY 10:00 AM

Kandrakota Nookalamma : కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట (Kandrakota) గ్రామంలో భక్తుల పాలిట కొంగుబంగారంలా విరాజిల్లుతున్న కాండ్రకోట నూకాలమ్మ (Nookalamma) అమ్మవారు ఆదివారం శాకంబరి దేవి (Shakambari Devi)గా ప్రత్యేక అలంకరణలో భక్తులకు ఆదివారం దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి మూలవిరాట్టు, ఉత్సవ మూర్తి, ఆలయ ప్రాంగణం, ఉపాలయాలను వివిధ రకాల కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఒకప్పుడు కరువుకాటకాల సమయంలో దేవతల ఆరాధనను మన్నించిన దేవి శతాక్షితా అవతరించి జీవరాశులన్నింటికి అవసరమైన ఆహారం, కూరగాయలు, పాడి పంటలు. జీవజలాలన్నింటినీ ఆమె శరీరం నుంచి విడుదల చేసి కాపాడిందని, ప్రజలకు కావాల్సిన శాకాలను సృష్టించినందుకు ఆమెను శాకంబరిగా కొలుస్తారని, ఈక్రమంలో శాకంబరీ ఉత్సవాలను అమ్మవారి ఆలయాలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా పండితులు వివరించారు. అమ్మవారిని దర్శంచుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నూకాలమ్మ  దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. రాంబాబురెడ్డి తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us