TTD : చంద్రప్ర‌భ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Updated 21st December 2023 Saturday 1:05 pm

Thirumala : శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ‌నివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్ర‌భ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు.

చంద్ర‌ప్రభ వాహనం – సకలతాపహరం

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల  పెద్ద‌ జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల చిన్న‌ జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి దంప‌తులు, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, పలువురు బోర్డు స‌భ్యులు, జెఈవో  స‌దా భార్గ‌వి, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us