Chandrababu Arrest : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. ఎన్ని వారాలంటే.?

Updated 31st October 2023 Tuesday 10:50 am

Chandrababu Arrest : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. నాలుగు వారాల పాటు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు పిటీషన్ వేశారు. పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరుచేస్తూ తీర్పు ఇచ్చారు. నాలుగు వారాలు అంటే.. నవంబర్ 24 వరకూ మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.

అయితే, చంద్రబాబు ఎవరితో మాట్లాడకూదని, హాస్పటల్ లోనే ఉండాలని, 24న సాయంత్రం 5గంటలకు సరెండర్ అవ్వాలని హైకోర్టు సూచించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు నారా లోకేశ్, నారా బ్రాహ్మణి రాజమండ్రి చేరుకున్నారు.

అయితే, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన విషయాన్ని లోకేశ్ వద్ద నాయకులు ప్రస్తావించారు. దీంతో యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యింది అంటూ నాయకులు, కార్యకర్తలతో లోకేష్ వ్యాఖ్యానించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us