ఆదిత్య వైస్ ప్రిన్సిపాల్ కు డాక్టరేట్

UPDATED 21st APRIL 2018 SATURDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వల్లెం శ్రీనివాసరావు కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ విభాగంలో పి.హెచ్.డి పట్టా పొందినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తమ సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, మెకానికల్ విభాగాధిపతి, వైస్ ప్రిన్సిపాల్ గా అకుంఠిత దీక్షా పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి తోటి అధ్యాపకులకు ఆదర్శనీయులయ్యారని ఈ సందర్భంగా సతీష్ రెడ్డి తన అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా డా. వల్లెం శ్రీనివాసరావు మాట్లాడుతూ మెకానికల్ విభాగంలో జె.ఎన్.టి.యూ.కె విశ్రాంత ఆచార్యులు డా. కె. మల్లికార్జునరావు పర్యవేక్షకులుగా వాసవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ ప్రధానాచార్యులు డా. అన్నంబొట్ల బాలాజీ శ్రీనివాసరావు సహాయ పర్యవేక్షణలో తాను సమర్పించిన సిద్ధాంత వ్యాసం "A FUZZY LOGIC APPROACH TOWARDS DETECTION OF ISOMORPHISM INVERSIONS AND RATING OF KINEMATIC CHAINS" థీసిస్ కు డాక్టరేట్ పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామ కృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్. రమాశ్రీ, ఎ. రామకృష్ణారావు, వివిధ విభాగాధిపతులు, డాక్టర్ వి.వి. కామేష్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us