గంగవరం (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏటిపల్లి ఆశ కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రిలే నిరాహార దీక్షలు మంగళవారం ప్రారంభించారు. ఈదీక్షా శిబిరాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ, గిరిజన సంఘం జిల్లా నాయకుడు తీగల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణిశ్రీ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం భీమా పాలసీని రద్దు చేసిందని, ప్రభుత్వం వెంటనే గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి చనిపోయిన ఆశ కార్యకర్తలకు రూ. 10 లక్షల నష్ట పరిహారం ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాలకు వెళ్లకుండా గంగవరం మెడికల్ ఆఫీసర్ అడ్డుకుంటున్నారని ఆశా వర్కర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ధర్నాలకు వెళితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కీమ్ వర్కర్లపై వేధింపులను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది అన్నారు. గత నెల 23న చనిపోయిన చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గిరిజన సంఘం నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్న ఆశావర్కర్లపై మెడికల్ ఆఫీసర్ వేధింపులు సరికాదన్నారు. మారుమూల గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రతిక్షణం ప్రమాదంతో ప్రయాణం చేస్తున్న ఆశా వర్కర్లకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు చనిపోయిన నలుగురు ఆశా వర్కర్లకు న్యాయం జరిగే వరకు ఆశా వర్కర్లకు గిరిజన సంఘం అండగా ఉంటుందని అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి కార్యకర్తల నాయకులు మంగమ్మ, మార్తమ్మ తదితరులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







