Anaparthi : ​ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్

UPDATED 31st JULY 2026 9:00 AM

* సత్యగౌరీ థియేటర్‌లో రూ.3.50 లక్షల నష్టం

​అనపర్తి, రెడ్ బీ న్యూస్, జూలై 31 : సాంకేతిక లోపాల కారణంగా థియేటర్లలో భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. అనపర్తి సత్యగౌరీ థియేటర్‌లో గురువారం మధ్యాహ్నం ఏసీ కంప్రెషర్ యూనిట్‌లో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.​సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు బృందం వేగంగా స్పందించి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అనంతరం థియేటర్‌లోని ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఏసీ యూనిట్ దూరంగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, రూ.3.50 లక్షల మేర సామగ్రి దగ్ధమైంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us