మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని

UPDATED 7th AUGUST 2026 11:00 AM

  • రాజమహేంద్రవరంలో ఘోరం.. ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఉన్మాదుల హల్‌చల్
  • సినిమా చూసొస్తుండగా వైద్య విద్యార్థులపైకి కారు ఎక్కించిన నిందితులు
  • హైదరాబాద్ KIMSలో వెంటిలేటర్‌పై ప్రియాంక.. కంటిపాప పరిస్థితి చూసి తల్లిదండ్రుల రోదన

రాజమహేంద్రవరం, రెడ్ బీ న్యూస్, ఆగష్టు 7 : సమాజానికి ప్రాణాలు పోసే వైద్యులుగా మారాల్సిన ఆ యువ విద్యార్థుల జీవితాల్లో మద్యం మత్తులో ఊగుతున్న ఇద్దరు ఉన్మాదులు పూడ్చలేని విషాదాన్ని నింపారు. సరదాగా సినిమా చూసి వస్తున్న మెడికోలపైకి కారును వేగంగా పోనిచ్చి, వారి ప్రాణాలతో చెలగాటమాడిన సంఘటన రాజమహేంద్రవరం నగరంలో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే:

జి.ఎస్.ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంక, ఆమె మిత్రుడు వెంకట దుర్గా సాయి ఉమేష్ (రేడియాలజీ) ఈ నెల 3న ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసి బయటకు వస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో నామవరానికి చెందిన సూరావరపు ధస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా మద్యం సేవించి కారులో అక్కడికి వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది వారి ప్రవర్తనను గమనించి లోపలికి అనుమతించకపోవడంతో అహంతో రగిలిపోయిన ఆ యువకులు కారును రయ్ మంటూ వెనక్కి తీశారు.

​ముందు వెళ్తున్న మెడికోల స్కూటీని ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టారు. "ఏంటలా చేస్తున్నారు?" అని ఉమేష్ నిలదీసే లోపే, ఏమాత్రం మానవత్వం లేకుండా వారిపైకే కారును పోనిచ్చారు. ఈ రాక్షసత్వంలో ప్రియాంక తలపై నుంచి కారు టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే తీవ్ర రక్తగాయాలతో కుప్పకూలిపోయింది. ఉమేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం:

ప్రస్తుతం ప్రియాంక హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతోంది. ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించడంతో హైదరాబాద్‌లోని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి ప్రియాంక మృతి చెందింది..

పోలీసుల వేగవంతమైన చర్యలు:

ఈ ఘటనపై ప్రకాష్ నగర్ పోలీసులు ఉమేష్, మాల్ మేనేజర్ ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. ఈ కిరాతకానికి ఒడిగట్టిన ధస్వంత్, జోసెఫ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ సుభాష్ తెలిపారు. స్థానికులు మాత్రం ఇలాంటి ఉన్మాదులపై చట్టం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us