Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!

UPDATED 3rd AUGUST 2026  12:20 PM

​హోదాను పక్కనపెట్టి ప్రభుత్వ కళాశాలలో కుమార్తెను చేర్పించిన పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి ఎం. బాబు

​పిఠాపురం, రెడ్ బీ న్యూస్, ఆగష్టు 3: సమాజంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు తమ పిల్లలను లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్న రోజులివి. కానీ, కాకినాడ జిల్లా పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి ఎం. బాబు ఇందుకు భిన్నంగా వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. హోదాను పక్కనపెట్టి, తన కుమార్తెను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తనకు ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు.

​ప్రతిభను చూసే ఈ నిర్ణయం

జడ్జి బాబు తన కుమార్తె మన్నవ హదాసను పదో తరగతి వరకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూలులోనే చదివించారు. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు చూపుతున్న ప్రతిభ, రాణిస్తున్న తీరును నిశితంగా గమనించిన ఆయన.. తన కుమార్తెను ప్రభుత్వ కళాశాలలోనే చదివించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలోని పీఎంశ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్లస్ జూనియర్ కళాశాలలో హదాసను బైపీసీ (BiPC) మొదటి సంవత్సరంలో చేర్పించారు.

​కార్పొరేట్‌కు తగ్గని బోధన: విద్యార్థిని హదాస

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందిన జడ్జి కుమార్తె హదాస మాట్లాడుతూ.. "ఇక్కడి విద్యాబోధన ఎంతో బాగుంది. లెక్చరర్లు ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ఎన్ని సందేహాలు అడిగినా సమగ్రంగా వివరిస్తున్నారు" అని ఆనందం వ్యక్తం చేశారు.
పెరిగిన విశ్వాసం: ప్రిన్సిపాల్ శ్యామ్ బాబు 

న్యాయమూర్తి వంటి ఉన్నతాధికారి తన కుమార్తెను సర్కారీ కళాశాలలో చేర్పించడం పట్ల ప్రిన్సిపాల్ జి. శ్యాంబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సాధారణ ప్రజల్లో ప్రభుత్వ కళాశాలలపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టిన జడ్జి ఎం. బాబు నిర్ణయంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us