పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : పెద్దాపురం పట్టణంలో సాయి సేవా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించినట్లు సాయి సేవ గ్రూపు సభ్యులు తెలిపారు.. స్థానిక రోటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 130 మంది స్వచ్ఛంధంగా వచ్చి రక్తదానం చేసినట్లు గ్రూప్ సభ్యులు తెలిపారు.. అనంతరం సందర్భంగా సాయి సేవా సభ్యులు మాట్లాడుతూ సాయి సేవ ద్వారా అనేక సేవ కార్యక్రమలు నిర్వహించడం జరుగుతున్నట్లు చెప్పారు. గత 5 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నమని, కరోన వైరస్ ను దృష్టిలో పెట్టుకొని చాలా మందికి రక్తం అవసరం అవుతుందని అన్నారు. మా సంస్థ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సేవ సభ్యులు అద్దేపల్లి రమేష్, గొల్లపూడి సునీల్, పసుమర్తి వేణుగోపాల కృష్ణ, అత్తెం రమేష్, రాజేష్, చంద్రశేఖర్ శర్మ, గుమ్మడి వాసు, కరెడ్ల రాజా, బాదం బాబు, పాబోలు ప్రసాద్, పెద్దాపురం రోటరీ ప్రెసిడెంట్ కొట్టి సుధాకర్, సెక్రటరీ టి.సత్యనారాయణ, ఎస్.ఆర్కేచౌదరి, రోటరీ డాక్టర్ పసుపులేటి కామరాజు, ప్రభాకర్, ప్రసన్న, రాధ, తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







