గంగవరం:8 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న ప్రభుత్వం ధ్యేయమని రంపచోడవరం శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గొల్లపల్లి బేబీ రత్నం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్రపటానికి వాల్మీకి మహిళలు పాలాభిషేకం మంగళవారం నిర్వహించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో వైయస్సార్ చేయూత పథకానికి వాల్మీకి మహిళ మహిళల ధరఖాస్తులు ఆన్ లైన్ లో రిజెక్ట్ అయ్యాయని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (బాబు) రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకువెళ్లా నన్నారు. దీనిపై సీఎం స్పందించి కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలపడంతో వాల్మీకి మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం దక్కిందన్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాల్మీకి మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు.
ఈకార్యక్రమంలో వాల్మీకి సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పిల్లా అనురాధ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంజం గంగాదేవి శారపు పావని, విరాట రమణయ్య, పిల్ల చిన్నబాబు మహిళలు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







