అమరావతి:26 డిసెంబర్ 2020(రెడ్ బీ న్యూస్): నివర్ తుఫాన్, ఇతర విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. 28న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు. రైతులను ఆదుకోవాలంటూ ఈ నెల 28న కృష్ణా జిల్లా కలెక్టర్‌కు పవన్ కల్యాణ్ వినతిపత్రం ఇస్తారని తెలిపారు. 17 లక్షల పైగా ఎకరాల్లో రైతులు పంట నష్టపోతే 7 లక్షల మందికి మాత్రమే పరిహారం అందించేలా కేబినెట్ తీర్మానం చేయడం అన్యాయమని మనోహర్ దుయ్యబట్టారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని తప్పబట్టారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఎకరాకు రూ.35వేల ఆర్థికసాయం, తక్షణ సాయంగా రూ.10వేలు అందించాలని మనోహర్ డిమాండ్ చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







