(తూర్పుగోదావరి, రెడ్ బీ న్యూస్,26 డిసెంబర్ 2020)
ఆయువకుడికి మూగజీవాల అంటే అమితమైన
ప్రేమ. సాంప్రదాయబద్ధమైన అభిరుచితో వివిధ రకాల
మూగజీవాలను ప్రేమతో పెంచుతున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన అడబాల లక్ష్మీనారాయణ అనే యువకుడు.. పాలిటెక్నికల్ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేశారు. హైదరాబాద్ లో రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి దానిని వదులుకొని
సొంతూల్లో వ్యాపారం ప్రారంభించాడు. అయితే తన
అభిరుచికి అనుగుణంగా తన తాతను స్పూర్తిగా తీసుకుని
జంతువులను పెంచుకుంటున్నాడు.
అయితే తెల్లని జులపాలతో .. అచ్చం బొచ్చు కుక్కలా ఉండే
నేపాల్ జింగ్ జాతి మేకను చూసి బొచ్చుకుక్క అనుకుంటే
పొరపడినట్లే ఇది నేపాల్ మేక. ఐదేళ్ల క్రితం నేపాల్ బ్రీడ్ కు
చెందిన రెండు మేకలను (ఆడ, మగ) రూ.1.20 లక్షలకు
కొనుగోలు చేశారు. ఏడాదిన్నర క్రితం వాటికి ఒక పిల్ల పుట్టిన
తర్వాత పెద్ద మేకలను తన స్నేహితులకు పెంచుకోవడానికి
ఇచ్చేశారు. సహజంగా చలి ప్రాంతంలో పెరిగే దీనికి ఎక్కువగా ఉన్ని ఉంటుందని ఆయన తెలిపారు. మేకతో పాటు సెయింట్ బెర్నార్డ్ పుంగనూరు జాతి ఆవులు,
గోవుల, గిరి ఆవులు,
ఒంగోలు ఆవులు, గుర్రం ఇలా పలు రకాల జంతువులను
పెంచుకుంటున్నాడు. అదేవిధంగా అమెరికన్ బెంటన్ కొచ్చిన్, బెంటన్ వంటి రకాల కోళ్లు సైతం అతని వద్ద ఉన్నాయి.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







