ముంబయి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 5 : దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదైన సంగతి తెలిసిందే. నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్ వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ రకం వైరస్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది. అలాగే రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఆదర్ష్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 9మందికి ఈ రకం వేరియంట్ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరంతా దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చినట్లు వెల్లడించింది.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







