గంగవరం:10 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): కొమరవరం ఎమ్.పీ.పీ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతూ ప్రమాదవశాత్తు కంటిచూపు కోల్పోయిన పండా అంజిబాబు దొర అనే గిరిజన విద్యార్థికి గంగవరం మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం ఆర్ధిక సహాయం గురువారం అందించారు.ఆ మొత్తాన్ని విద్యార్థి వైద్య ఖర్చులు నిమిత్తం రూ.31500 ను విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల కమిటి చైర్మన్ పండా రాజన్న దొర, పాఠశాల ఉపాధ్యాయురాలు మడకం తులసి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణతో కలిసి అందజేశారు. ఈ మొత్తాన్ని విద్యార్థి వైద్య ఖర్చులకు వినియోగించాలని వారు సూచించారు. మండలంలోని ఉపాధ్యాయులు బృందానికి విద్యార్థి తల్లిదండ్రులు, చైర్మన్ రాజన్న దొర కృతజ్ఞతలు తెలియజేశారు. ఈనాడు పాత్రికేయ మిత్రుడు నండూరి రమేష్ కూడా ఈ విద్యార్థికి కొంత ఆర్థిక సహయాం అందచేశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ యూటీఎఫ్ ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాల్లో ముందుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు రాంబాబు, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







