UPDATED 30th DECEMBER 2017 SATURDAY 6:00 PM
పెద్దాపురం: సాక్షాత్తూ రాష్ట్ర మంత్రుల సాక్షిగా పెద్దాపురం పాత్రికేయులకు ఘోర అవమానం జరిగింది. డిసెంబరు 30వ తేదీన అందరికీ ఇళ్ళు పథకాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం రహదారిలో నిర్మిస్తున్న గృహాసముదాయాలను పరిశీలించిన అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన పాత్రికేయులకు మాత్రం కూర్చునేందుకు కనీసం కుర్చీలు లేకపోవడంతో వారంతా నేలపై కూర్చుని మంత్రుల కార్యక్రమాన్ని కవర్ చేశారు. అయితే మీడియా ప్రతినిధులు అంతా నేలపైనే కూర్చోవడం చూసిన హోంమంత్రి చినరాజప్ప పాత్రికేయులను పట్టించుకొకపోవడంపై అధికారుల, ప్రజాపతినిధుల తీరు పలు విమర్శలకు దారితీసింది. పాత్రికేయులకు ఒరగబెట్టేది ఏమీ లేకపోయినా కనీసం విలువ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం.







