సామర్లకోట, 24 మే 2020 (రెడ్ బీ న్యూస్) : సామర్లకోట మున్సిపాలిటీని గ్రీన్ జోన్ గా మార్పు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు రెడ్ జోన్ గా ఉన్న పట్టణాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు. గత నెల ఏప్రిల్ 23న కోలావారి వీధిలో ఒక కరోనా కేసు బయటపడింది. ఆ కుటుంబంలోని వారికి పరీక్షలు
నిర్వహించగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో అప్పటినుంచి మున్సి పాలిటీ పరిధిలోని 4, 5, 6, 7, 15, 16 వార్డులను రెడ్
జోన్లుగా ప్రకటించి, ఆయా
వార్డులకు పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. పాజిటివ్ కేసులు వచ్చిన వారు చికిత్స తరువాత ఆరోగ్యంగా ఇళ్లకు చేరుకు
న్నారు. రెడ్ జోన్లోని ప్రాంతాల ప్రజలు సుమారు నెల రోజుల పాటు నిబంధనలు పాటించవలసి వచ్చింది. ఆ ప్రాంతంలో ఆదివారం రెడ్
జోన్ ఉపసంహరించడంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







