లండన్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: బ్రిటన్‌లోని టవర్ ఆఫ్ లండన్ ప్రాంతం.. సందర్శకులతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. ఆ సమయంలో ఇద్దరు రాయల్ గార్డులు గంభీరంగా కవాతు చేస్తున్న ఓ గార్డుకు అడ్డుగా వచ్చాడు. వెంటనే అతని కాళ్లకింద పడిపోయాడు. కానీ, ఆ గార్డు మాత్రం ఆగకుండా.. అతనిపైనుంచి అలాగే వెళ్లిపోయాడు. అయితే, కిందపడిన బాలుడు వెంటనే లేవడంతో.. అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ట్విటర్‌లో 20 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఘటనపై స్థానిక రక్షణ మంత్రిత్వశాఖ స్పందించింది. దీని గురించి తమకు తెలుసని ఒక ప్రకటనలో తెలిపింది. గార్డులు వస్తున్నారని ప్రజలను ముందస్తుగానే హెచ్చరించామని, కానీ.. దురదృష్టవశాత్తు ఆ బాలుడు సైనికుడికి అతి సమీపంలో వెళ్లినట్లు పేర్కొంది. అయినప్పటికీ.. ఆ సైనికుడు అతన్ని దాటే అడుగేసినట్లు, అనంతరం ఆ పిల్లాడినీ పరామర్శించినట్లు తెలిపింది. ‘క్వీన్స్ గార్డ్’ బృందం.. బ్రిటన్‌లోని రాచరిక నివాసాలకు కాపలా బాధ్యతలు చూస్తుంటుంది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై నెటిజన్లనుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఆ సమయంలో పిల్లాడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించగా.. మరికొందరు ఈ కవాతు సంప్రదాయాన్ని విమర్శించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







