రెడ్ బీ న్యూస్, 16 జనవరి 2022: గోదారోళ్లు అంటే ఆతిథ్యానికి మారుపేరు. అందులోనూ సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. ఇక కొత్త అల్లుళ్లులకు అయితే.. ఆ మర్యాదల గురించి చెప్పక్కర్లేదు. అయితే.. పశ్చిమ గోదావరిలో ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి 365 రకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చింది. భోజనం సామాన్యంగానే అల్లుళ్లంటే మర్యాదలెక్కువ. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. ఇక సంక్రాంతి సమయాల్లో కొత్త అల్లుళ్లొస్తే ఆ హంగామా అంతా ఇంతా ఉండదు. పిండి వంటలు, కొత్త బట్టలు అవీ ఇవీ అని ఆ హడావుడే చెప్పక్కర్లేదు. అయితే.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి ఏకంగా 365 రకాల వంటకాలతో ఆతిథ్యమిచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అత్యం మాధవి, వెంకటేశ్వరరావు కుమార్తె కుందవి. ఈ అమ్మాయికి.. తణుకుకు చెందిన తుమ్మలపల్లి సాయి కృష్ణతో వివాహం నిశ్చయమైంది. జిల్లాలోని నరసాపురానికి చెందిన కుందవి అమ్మమ్మ, తాతయ్య గోవింద్, నాగమణి.. కాబోయే వధూవరులను తమ ఇంటికి ఆహ్వానించారు. కాబోయే మనవడికి 365 రకాల వంటలను రుచి చూపించారు.100 రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలతో పాటు రకరకాల పిండి వంటలతో ఆతిథ్యమిచ్చారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







