గంగవరం: 9 సెప్టెంబర్ 2020 (రెడ్ బీ న్యూస్): ఇటీవల అకాల మరణం పొందిన మొల్లేరు సొసైటీ మాజీ సీఈవో బుర్రి రాంబాబు జ్ఞాపకార్థం ఆయన భార్య అన్నపూర్ణ పిడత మామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలపై దృష్టి సారించారు.ఈ మేరకు రోగులు సౌకర్యార్థం ఒక బెడ్ ను బహూకరించారు. బుధవారం ఆ బెడ్ ను పీహెచ్సీ స్థల దాత డీసీసీబీ మాజీ డైరెక్టర్ వై. వెంకటేశ్వరరావు, రాంబాబు కుటుంబ సభ్యులు ఆరోగ్య కేంద్రంలో అందజేశారు. ఆరోగ్య కేంద్రానికి బెడ్ బహుకరణ పట్ల వైద్యాధికారి రమాదేవి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూ. రామకృష్ణ ఏనుగు శివాజీ, వర్రి నాగేశ్వరరావు, తుమ్మల చిట్టి బాబు హెల్త్ సూపర్ వైజర్లు రాజబాబు చల్లా రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







