శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం

* జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్‌ అస్మి 
* నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా...

UPDATED 12th JUNE 2019 WEDNESDAY 8:00 PM

కాకినాడ: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి జవాబుదారీగా పని చేస్తామని తూర్పు గోదావరి ఎస్పీ అద్నాన్ నయీమ్‌ అస్మి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం ఉదయం చేరుకున్న ఆయనకు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వాదాలు అందజేశారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తానని, ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని అన్నారు. పోలీసులు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, అందుకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తామన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంఘ విద్రోహ కార్యకలాపాలు, రౌడీయిజం, ఇతర నేరాలను పూర్తిగా అరికడతామన్నారు. ఎప్పటికప్పుడు డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి జిల్లాలో నేరాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో 2016 నుంచి 2018 వరకు పనిచేశానని, ప్రభుత్వం ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us