గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: గిరిజనుల భూములకు రక్షణ కవచం 1/70 చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని గిరిజన వర్ధిక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కె.చిన్నారావు అధికారులను కోరారు. ఇటీవల మండలంలోని లక్కొండలో ప్రభుత్వ భూమిని గిరిజనేతరులు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని తమ సంస్థ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేసి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే ఏజెన్సీలో గిరిజనేతరుల సాగులో ఉన్న భూములను గుర్తించి వారి నుంచి స్వాధీనం చేసుకొని గిరిజనులకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలు సక్రమంగా అమలు చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







