సామర్లకోట:10 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్):
జిల్లా కేంద్రామైన కాకినాడ నుంచి సామర్లకోటకు వచ్చే రోడ్డుకు మోక్షం కల్పించాలని పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు గురువారం సైకిల్ పై నిరసన వ్యక్తం చేశారు. పెద్దాపురం నుంచి కాకినాడ వరకు సైకిల్ పై ర్యాలీ నిర్వహించి జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాకినాడ వ్యాపార వాణిజ్య విద్యా ఉద్యోగ తదితర అవసరాల నిమిత్తం తరచూ ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు నిర్వహించడం
జరుగుతుందన్నారు. అయితే సామర్లకోట నుంచి కాకినాడ వచ్చే రోడ్డు అధ్వానంగా
మారడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని,
రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో
పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి నెలకొందన్నారు. రోడ్లు గుంతలు పడి
వర్షపు నీటితో నిండి చెరువులుగా కనిపిస్తున్నాయన్నారు.
ఈ రోడ్డులో ప్రయాణించే అనేక మంది ప్రాణాలు
కోల్పోవడం జరిగిందన్నారు. కాకినాడ సామర్లకోట రోడ్డును తక్షణమే పునరుద్ధరించాలని వారు కోరారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







