గంగవరం (రెడ్ బీ న్యూస్) 24 డిసెంబర్ 2021: ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చెయ్యాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి పదకొండవ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా యూనియన్ లీడర్స్ మార్తమ్మ, మంగమ్మలు మాట్లాడుతూ గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట అధికారుల వేధింపులు అరికట్టి, చిన్నారి కుటుంబానికి న్యాయం చెయ్యాలని రిలే దీక్షలు చేపట్టినప్పటికి సంబందిత అధికారులు మాత్రం పట్టించుకోకుండా వ్యవహారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాలేదన్నా కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన వైద్యాధికారులు తీరు నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. ఆశావర్కర్ మృతి చెందినా, న్యాయ విచారణ జరపవలసిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారంటే చిరు ఉద్యోగుల ప్రాణం కంటే వైద్యులతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయా అని వారు ప్రశ్నించారు. అధికారులు దిగి వచ్చేవరకు మా ఆందోళన కొనసాగుతుందని, ఉన్నతాధికారులు స్పందించక పొతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే మా ఆందోళనకి సీఐటీయూతో పాటు పలు ప్రజా సంఘాల మద్దత్తు తెలిపాయని అన్నారు. ఈ సందర్బంగా అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఆశవర్కర్లు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







