శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఓ వ్యక్తి ఒమిక్రాన్ బారిన పడ్డారనే విషయం మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి గత నెల 23న దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. ఇంటికొచ్చాక జ్వరం రావడంతో ఈ నెల 5న స్థానిక పీహెచ్‌సీలో మరోసారి పరీక్ష చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో ఆయన విదేశాల నుంచి రావడంతో కరోనా కాదు ఒమిక్రానే అయి ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలు హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక రావాల్సి ఉంది. ప్రస్తుతం బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నగరంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ విషయమై కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ మాట్లాడుతూ నివేదిక వచ్చిన తర్వాత ఒమిక్రాన్ అవునా? కాదా? అనేది తెలుస్తుందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







