గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 21 నవంబర్ 2021: గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. కృష్ణ అన్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు పురస్కరించుకుని ఆదివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న  ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు నిరుద్యోగులకు అవసరమయ్యే పలు పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్లి తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన చేతులమీదుగా బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సత్యవతి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us