SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!

UPDATED 16th SEPTEMBER 2026 12:30 PM

REDBEENEWS : పెద్ద పెద్ద కంపెనీలు, పరిశోధన కేంద్రాలకే పరిమితం అనుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఇప్పుడు నేరుగా సామాన్యుడి గుమ్మం తొక్కింది. పది చదవలేకపోయినా, రోజువారీ కూలీ పనిచేస్తున్నా.. నేడు స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఏఐ మనకు అత్యంత నమ్మకమైన సలహాదారుగా మారుతుంది. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా, మన మాతృభాషలోనే ప్రశ్నలు అడిగి అనేక సమస్యలకు ఇట్టే పరిష్కారాలు రాబట్టుకోవచ్చని సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సందీప్ మిరియాల సూచిస్తున్నారు.

పిల్లల చదువులకు ‘డిజిటల్ మాస్టారు’

​బడిలో పిల్లలకు గణితం లేదా ఇతర సబ్జెక్టులు అర్థం కాకపోతే ఇక ఆందోళన చెందాల్సిన పనిలేదు. కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ను ఫోటో తీసి ఏఐ టూల్స్‌కు పంపిస్తే, అది పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తుంది. అంతేకాదు, పరీక్షలకు ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలను తయారు చేసుకోవడంతో పాటు, ఇంగ్లీష్ పదాలకు తెలుగు అర్థాలను చిటికెలో తెలుసుకోవచ్చు.

రోజువారీ పనులు, దరఖాస్తులు ఇట్టే దూరం

​ఉద్యోగంలో లేదంటే కూలీ పనుల్లో దరఖాస్తులు రాయాలన్నా, పిల్లల స్కూల్‌కు సెలవు లేఖ (Leave Letter) తయారు చేయాలన్నా ఇప్పుడు ఎవరి సహాయమూ కోరాల్సిన పనిలేదు. మనకు కావాల్సిన విషయాన్ని సాధారణ తెలుగులో చెబితే చాలు, ఏఐ సెకన్లలో అందమైన లేఖను సిద్ధం చేసి ఇస్తుంది.

గృహ ఆర్థిక నిర్వహణ.. కూలీ లెక్కలు

​రోజువారీ కూలీ ఎంత అవుతుంది? నెలలో ఇన్ని రోజులు పని చేస్తే మొత్తం ఎంత వస్తుంది? అనే లెక్కలను ఎంతో సులభంగా వేసుకోవచ్చు. అలాగే మన నెలవారీ ఖర్చుల వివరాలను ఏఐకి వివరిస్తే, ఎక్కడ అనవసర ఖర్చులు అవుతున్నాయో విశ్లేషించి, పొదుపు చేసుకునే మార్గాలను ఇది సూచిస్తుంది.

వ్యవసాయం, రోజువారీ జ్ఞానం కోసం నేస్తం

​పంటల గురించి ప్రాథమిక సమాచారం, వాతావరణ మార్పులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్ద చదువులు లేకపోయినా, ప్రతిరోజూ పది నిమిషాల్లో కొత్త విషయాలు నేర్చుకునేలా ఏఐ మనకు తోడుగా నిలుస్తుంది. డేటా సెంటర్లు, విద్యుత్ వినియోగంపై చర్చలు ఎలా ఉన్నప్పటికీ.. మన కుటుంబానికి, పిల్లల భవిష్యత్తుకు ఏఐని ఒక బలమైన సాధనంగా మలచుకోవడం నేడు ఎంతో అవసరం.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us