పెద్దాపురం,11 అక్టోబరు 2020(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణ శివారు గాలిబంగ్లా ప్రాంతంలో
ఆదివారం సాయంత్రం గొర్రెల మందపైకి ఇండికా కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 20 గొర్రెలు వరకూ అక్కడిక్కడే మృతి చెందాయి. పట్టణానికి చెందిన గొర్రెల పెంపకందారుడు ఆల్సి లక్ష్మణ్ (లచ్చి) తన గొర్రెలను మేతకు తీసుకువెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి తోలుకు వస్తుండగా అటువైపు వస్తున్న టాటా ఇండికా కారు అదుపుతప్పి గొర్రెల మందమీదకు వేగంగా దూసుకుపోయింది. దీంతో గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. తన జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో పెంపకందారుడు లక్షణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







