గంగవరం: 3 ఆగస్టు 2020(రెడ్ బీ న్యూస్): ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను, వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని రంపచోడవరం శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ బాబు పేర్కొన్నారు. గంగవరం మండలం కొత్తాడ కస్తూర్భా విద్యాలయంలో రూ. 1.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కళాశాల భవన నిర్మాణ పనులను వారు సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్య అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, కస్తూర్భా బాలికల విద్యాలయం అప్ గ్రేడ్ చేస్తూ కళాశాల స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. కళాశాల కోసం భవన సదుపాయం సర్వ శిక్ష అభియాన్ నిధుల ద్వారా భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. బాలికా విద్యను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఏజెన్సీలో అనేక ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలలను నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాలను గతం కంటే మెరుగ్గా తీర్చడం జరుగుతుందన్నారు. విద్యుదీకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరి ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కస్తూర్భా బాలికల విద్యాలయంలో అమలు జరుగుతున్న నాడు-నేడు పనులను అనంతరం వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో ఆంగ్లంలో అమలు జరుగుతున్న నాడు నేడు పనులపై మండల విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు ఎమ్మెల్యేకు వివరించారు. నాడు నేడు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీవో జాన్ మిల్టన్ ప్రత్యేక అధికారి పద్మావతి. అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్.ఐ షరీఫ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అప్పలరాజు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







