రంపచోడవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) పేరును వైకాపా అధిష్ఠానం ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో తెదేపా తరఫున ఎమ్మెల్సీగా కొనసాగిన రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీ కాలం ముగియడంతో ఆ స్థానానికి ఎన్నికల సంఘం ప్రకటన జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీకి డిసెంబరు 10న ఎన్నికలు, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇటీవల పంచాయతీ, పరిషత్తు, పాలక ఎన్నికల్లో వైకాపా ఆధిపత్యంతో ఈ స్థానాన్ని సులువుగా దక్కించుకుంటామనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఉదయభాస్కర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించి పార్టీ తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఆనందంగా ఉందనీ.. సీఎం జగన్‌కు, పార్టీకి విధేయుడిగా ఉంటానన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







