రాజమహేంద్రవరం అర్బన్, 30 డిసెంబరు 2020(రెడ్ బీ న్యూస్): రాజమహేంద్రవరంలో సుమారు రూ.200 కోట్లతో నిర్మించబోయే ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనకు కేంద్ర మంత్రి గాంగ్వర్ వచ్చే నెల రెండవ వారంలో రానున్నారని ఎంపీ మార్గాని భరత్‌రామ్ వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించగా అంగీకరించారని చెప్పారు. ఆసుపత్రి తోపాటు 32 మంది సిబ్బంది నివసించడానికి వీలుగా క్వార్టర్ల నిర్మాణం చేస్తారన్నారు. ఈ మేరకు నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ప్రాంతంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి స్థల పరిశీలన జరపాలని కోరగా అందుకు మంత్రి అంగీకరించారని ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







