హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన కంపెనీ.. బ్యాంకును మోసం చేసిన అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసింది. నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ఎం.శశిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హైదరాబాద్ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. రుణాల పేరిట రూ.61.86 కోట్లు మోసం చేశారంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. తప్పుడు పత్రాలు, వివరాలు సమర్పించి నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రుణాలు పొంది, వాటిని ఇతర అవసరాలకు మళ్లించి వ్యక్తిగత లబ్ధి పొంది.. ఆ తర్వాత ఎగవేశారని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆరోపణ. దివంగత ఎస్పీవై రెడ్డితో పాటు సురేష్, సజ్జల శ్రీధర్‌రెడ్డి, శశిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, నంద్యాలలో సీబీఐ సోదాలు నిర్వహించింది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







