గంగవరం (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : మరణించిన ఆశావర్కర్లు కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం ఇచ్చి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ తో గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశాలు చేస్తున్న రిలే దీక్షలు సోమవారం నాటికి 21వ రోజుకు చేరుకున్నాయి.. ఈ సందర్భంగా సంఘ నాయకులు మార్తమ్మ, మంగాయమ్మ మాట్లాడుతూ ఇప్పటివరకు గిరిజన సంఘాలు, యూటిఎఫ్ తదితర సంఘాలు మద్దతు తెలుపుతున్నా, అధికారులు, ప్రభుత్వం తమ దీక్షలను భేఖాతరు చేయటం లేదని, ఇది సరికాదని వారు అన్నారు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం అశాడే నాడు రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఆందోళనలు చేపట్టడం జరుగుతుందన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







