Flying Golden Tortoise: ఎగిరే బంగారు తాబేళ్లను చూశారా..?

UPDATED 15th APRIL 2022 FRIDAY 08:00 AM

Flying Golden Tortoise : ప్రకృతి ఎన్నో వింతల సమాహారం.. ఎన్నో జంతువులు కనుమరుగవుతున్నా.. కొత్త కొత్త జీవులు బయటపడుతూ.. ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ తాబేళ్లను చూస్తే అలాగే అనకమానరు. అదేంటీ తాబేలు ఎప్పుడో చూశాంగా అనుకుంటున్నారా.. తాబేలు ఎగరదు. కానీ ఈ గోల్డెన్‌ టాటాయిస్‌ మాత్రం గాల్లో ఎగురుతుంది. బంగారు వర్ణంలో ఉన్న ఈ తాబేలు గాల్లో స్వేచ్ఛగా విహరించగలరు.

దీనికి సంబంధించిన వీడియోను అమేజింగ్‌ ప్లానెట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. చిన్న కీటకం సైజులో ఉండి తాబేలు పోలి ఉన్న దీనికి రెక్కలున్నాయి. కదిపితే రివ్వున గాల్లోకి ఎగురుతున్నాయి. ఇవి మనకు సాధారణంగా కనిపించే రెక్కల పురుగుల్లాంటివేనని, బంగారు పూత పూసినట్టుగా ఉన్న వీటి రంగు మాత్రం అరుదుగా కనిపించేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి సుమారు 14 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us