రెడ్ బీ న్యూస్, 31 డిసెంబర్ 2021: హర్భజన్ సింగ్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 1998లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ ఆఫ్ స్పిన్నర్.. అనతికాలంలో జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. 31 ఏళ్లకే టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో తన స్పిన్ మాయజాలంతో టీమ్‌ఇండియాకు విజయాలందించిన భజ్జీ.. 2016 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించలేదు. కారణం.. అతడికి జట్టులో చోటు దక్కకపోవడమే. మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని భావించిన ఈ వెటరన్ స్పిన్నర్ చాలా కాలంపాటు నిరీక్షించాడు. కానీ, నిరాశే మిగిలింది. దీంతో ఈ మధ్యే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు భజ్జీ. అప్పట్లో ఇలా అనుహ్యంగా జట్టు నుంచి తప్పించడం గురించి హర్భజన్ తాజాగా పెదవి విప్పాడు. కేవలం 31 ఏళ్ల వయసులో 400 వికెట్లు పడగొట్టిన తనకు జట్టులో స్థానం దక్కకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోందని హర్భజన్ వెల్లడించాడు. తాను జట్టులో ఉండటం ఎవరికి సమస్యగా మారిందో, తనని తొలగించడంలో ఎవరి ప్రమేయం ఉందో కూడా తెలియదని పేర్కొన్నాడు. ‘‘నేను నా 400వ టెస్ట్ వికెట్ తీసినప్పుడు నాకు 31 ఏళ్లు. అక్కడికి రాబోయే ఎనిమిది, తొమ్మిదేళ్లలో కనీసం వంద కంటే ఎక్కువ వికెట్లు తీస్తానని భావించా. కానీ ఆ తర్వాత నన్ను జట్టుకు ఎంపిక చేయకపోవడంతో మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. 400 వికెట్లు తీసిన ఆటగాడిని ఎలా విస్మరించవచ్చు అనేది ఒక రహస్యమైన కథ. ఇది ఇంకా బయటికి వెల్లడి కాలేదు. 'అసలు ఏం జరిగింది? నేను జట్టులో కొనసాగడం ఎవరికి సమస్యగా మారింది?’ అనే విషయాలు నన్ను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







