కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: సంబంధించి మూడో విడత సొమ్ము విద్యార్థుల తల్లుల ఖాతాకు జమ చేసే ప్రక్రియను వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరికిరణ్, జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ మేయర్ సుంకర శివప్రసన్న తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు తొలి విడతలో రూ.66.30 కోట్లు, రెండో విడతలో రూ.69.10 కోట్లు, మూడో విడతలో రూ.67.97 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కాకినాడ గ్రామీణంలోని మోహన్ డిగ్రీ కళాశాల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పాత్రో సాయిప్రకాశ్ తన తల్లి పాత్రో అలివేలుమంగతో కలిసి వర్చువల్‌లో సీఎంతో మాట్లాడారు. అనంతరం ఈ పథకానికి సంబంధించి లబ్ధి చెక్కును కలెక్టర్, ప్రజాప్రతినిధులు అందజేశారు. డీఆర్వో సత్తిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగలక్ష్మీదేవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ మయూరి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







