రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ప్రజాసమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ భరత్‌రామ్ తెలిపారు. శనివారం వి.ఎల్.పురంలోని తన కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రాజన్న రచ్చబండ కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వివిధ సమస్య పరిష్కారం కోరుతూ పలువురు ప్రజలు ఎంపీకి అర్జీలు అందజేశారు. జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల ఎదురుగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంపై 150 మంది వైద్య విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఎంపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సోమవారం నుంచి పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పింఛను మంజూరు చేయించినందుకు వృద్ధకళాకారుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను సత్కరించారు.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. ఈ మేరకు శనివారం 43వ డివిజన్‌లో పర్యటించారు. కాలువలు, రోడ్లు పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరును నివాసితులను అడిగి తెలుసుకున్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







