పెద్దాపురం, 24 జూలై 2021(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) నూతన కార్యవర్గాన్ని సీనియర్ జర్నలిస్టులు చల్లా విశ్వనాథం, మొల్లి సూర్యనారాయణ
ఆధ్వర్యంలో స్థానిక సమాచార శాఖ కార్యాలయం వద్ద శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ గౌరవ అధ్యక్షుడుగా మొల్లి సూర్యనారాయణ (విజయభాను), క్లబ్ గౌరవ సలహాదారుడు ఎన్. శ్రీరామ్, క్లబ్ అధ్యక్షుడుగా పచ్చిపాల ప్రసాదరావు (సూర్య),
ప్రధాన కార్యదర్శిగా
చవ్వాకుల ఈశ్వరరావు (ఆంధ్రప్రభ), కోశాధికారిగా బద్ది కుమార్ (కోస్తా సమయం), ఉపాధ్యక్షుడుగా బొదిరెడ్డి బుజ్జిబాబు (సీమాంధ్ర ఉదయం),
సహాయ కార్యదర్శిగా పాశిల ప్రసాద్ (సూర్య), కార్యవర్గ సభ్యులుగా పిడపర్తి విక్రమ శాస్త్రి (మువ్వలు), నల్లల కొండలరావు (ఎక్స్ ప్రెస్ టుడే), సిద్ధాంతపు సుబ్బారావు (ఉదయాక్షరం),
ఎస్.కే అప్సర్ (అభయ్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని పలువురు రాజకీయ, అధికార ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాకుర్తి రాంబాబు, వినాయక్ నర్లజర్ల, రాయవరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







