సామర్లకోట: 7 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సామర్లకోట మండల కమిటీ ఆధ్వర్యంలో మార్చి 28 నుంచి ఇప్పటి వరకు రూ.4,54,192 విలువైన ఆహార పదార్థాలు పంపిణీ చేసినట్లు సీఐటీయూ మండల ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్ తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన ఆదివారం మాట్లాదారు. సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 7,913 మందికి ఆహార పదార్థాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 1380 మాస్కులు పంపిణీ చేశామని, మండలంలో కార్మికులకు, బిల్డింగు వర్కర్లకు, రిక్షా కార్మికులకు, పంచాయతి, మునిసిపల్ కార్మికులకు, వలస కార్మికులకు 1541 మందికి పంపిణీ చేసినట్లు తెలియచేశారు. జాతీయరహదారిపై రావులపాలెం, గండేపల్లి, ప్రత్తిపాడు, కత్తిపూడి, తుని ఐదు శిబిరాలకు సామర్లకోట కమిటీ నుంచి 6372 మంది వలస కార్మికులకు భోజనం, అల్పాహారం, మజ్జిగ, మంచినీరు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు సీఐటీయూ సంఘాలు బిల్డింగ్ వర్కర్స్, హమాలిస్, అంగన్వాడి, ఆశ వర్కర్స్ సంఘాల సభ్యులతో పాటు మానవత్వంతో అనేక మంది సహాయం చేశారని, వారందరికీ మండల కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు బర్ల గోపాల్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, కార్యదర్శి వి.కొండలరావు, నాయకులు నరవ సురేష్, బాలం సత్తిబాబు, మాణిక్యం, సోమేష్, హరి, మహేష్ పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







