రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ధవళేశ్వరంలోని జలవనరుల శాఖ ఎస్ఈ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సాగుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉభయ గోదావరి జిల్లాల ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు (IAB) సమావేశాన్ని ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడలోని వివేకానంద హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో నీటి లభ్యత, సాగు ఆయకట్టుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. అనంతరం ఆయన్ని జలవనరుల శాఖ అధికారులు సత్కరించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







