గంగవరం:11 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): మండలంలో రైతు ఉత్పత్తి దారుల సంఘాలతో
వారి అభివృద్ధి కోసం పనిచేస్తున్న టానేజర్ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మెత్త గ్రామం లో కేవీకే, పందిరిమామిడి వారి సహకారంతో తక్కువ
ఖర్చుతో వానపాముల ఎరువు తయరీపై సంఘం సభ్యులకు రెండు రోజుల
శిక్షణ కార్యక్రమము నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్తలు లలిత కామేశ్వరి, రాజశేఖర్ పాల్గొని వివిధ రకాల
వానపాములు, వాటి లక్షణాలు, వానపాములు ఎరువు, బెడ్లు తయరీ,
వాటికి కావాల్సిన వివిధ వస్తువులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వానపామూల -
ఎరువు తయరీ విధానాలు, ఎరువును సేకరించడం, ఎరువు యొక్క
పోషకాలు, సేంద్రియ ఎరువులు గురించి వీడియో చిత్రపటముల
ద్వారా సభ్యులకు వివరించారు. కేవీకే గిరిజన ఉప ప్రణాళిక ద్వారా వీరి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమములు చేపడుతున్న
మని, గిరిజనులు వీటిపై అవగాహన పెంచుకుని టానేజర్ వంటి సంస్థ
ద్వారా అందించే సేవలను సమర్థవంతంగా ఉపయోగించు కోవాలని సీనియర్ శాస్త్రవేత్త లలిత కామేశ్వరి వివరించారు. శిక్షణ తర్వాత వానపాములు
బెడ్ లను ప్రత్యక్షంగా తయారు చేయించారు. అనంతరం సభ్యులకు వానపాముల కిట్లులను ఉచితంగా అందించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు,
టానేజర్ మండల డీడీ రామరావు,ఎమ్.వో రామకృష్ణ సిబ్బంది పొల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







