గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 నవంబర్ 2021: ప్రత్తిపాడులో జరిగిన అల్లర్లతో సంబంధంలేని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజుతో సహా మరో 36 మందిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని నిరసిస్తూ ఆదివారం మండలంలోని రాములు దేవపురంలో లిబరేషన్ గిరిజన సంఘం నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అల్లర్లకు బాధ్యులైన అధికార పార్టీ నాయకులను వదిలేసి సంబంధంలేని లిబరేషన్ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం అన్యాయమన్నారు. లిబరేషన్ నాయకులపై దాడులు చేసి తిరిగి వారి పైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ గిరిజన సంఘం నాయకులు అల్లి చంద్ర రావు, కాటం దొర, సత్తియ్య దొర తదితరులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







