రెడ్ బీ న్యూస్, 2 జనవరి 2022: ఏదైనా ఒక విమానం.. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాలంటే ముందుగా అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ) నుంచి ఆయా అనుమతులు తప్పనిసరి. కానీ.. ఇటీవల ఓ విమానం మాత్రం ఏటీసీ క్లియరెన్స్ లేకుండానే టేకాఫ్ కావడం గమనార్హం. స్పైస్‌జెట్‌కు చెందిన విమానం డిసెంబరు 30న గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఉదయం 9.30కు బయల్దేరి.. 11.15కు దిల్లీలో దిగింది. అయితే, టేకాఫ్‌కు ముందు పైలట్లు.. అవసరమైన ఏటీసీ క్లియరెన్స్ తీసుకోలేదని అధికారులు గుర్తించారు. ‘పైలట్లు రాజ్‌కోట్ ఏటీసీ నుంచి టేకాఫ్ అనుమతి తీసుకోలేదు. దీనిపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ)లకు సమగ్ర నివేదిక పంపాం’ అని రాజ్‌కోట్ ఏయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ తాజాగా విచారణకు ఆదేశించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. కమ్యూనికేషన్ లోపమా? లేదా మరేదైనా కారణమా త్వరలో తేలుతుందన్నారు. ‘టేకాఫ్ అనుమతి లేకుండా ఎలా వెళ్లారని రాజ్‌కోట్ ఏటీసీ.. ఆ పైలట్‌లను ప్రశ్నించింది. ఇందుకు వారు పొరపాటు జరిగిందని తెలిపారు. ఈ విషయమై క్షమాపణలూ చెప్పారు’ అని ఏఏఐ సీనియర్ అధికారి ఒకరు.. ఓ జాతీయ వార్తాసంస్థకు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆ పైలట్లను విధుల నుంచి తప్పించినట్లు స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







