దేవాస్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: సాధారణంగా మేకలు శాకాహార జంతువులు. చెట్ల ఆకులు, కూరగాయలు, ధాన్యం తిని బతుకుతాయి. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ పట్టణ సమీపాన లోహారి గ్రామ రైతు రఫీఖ్ పెంచుతున్న మేక ‘భూరి’కి మాత్రం రోజూ చికెన్ బిరియానీ కావాల్సిందే. చెట్ల ఆకుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. విషయం తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న జనం ఓ వింతలా ఈ మేకను చూసి పోతున్నారు. రఫీఖ్ తన పొలంలో ఆవులు, గేదెలు, మేకలు పెంచుతున్నారు. వీటిలో ‘భూరి’ ప్రత్యేకం. మాంసాహారమంటే తెగ ఇష్టపడే ఈ మేక.. చికెన్, మటన్, చేప, గుడ్లు ఏదైనా గుటుక్కుమని తినేస్తుంది. ‘మా పొలంలో పుట్టిన ‘భూరి’ని చిన్నప్పటి నుంచీ పెంచుతున్నా. మూడేళ్లుగా మాంసాహారం తింటోంది. చికెన్ రోజూ కావాల్సిందే’ అని రఫీఖ్ తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







