అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: గృహాల లబ్ధిదారుల రుణాలపై వడ్డీ మాఫీకి గృహ నిర్మాణ సంస్థ అధికారులు 2014-19 మధ్య అయిదు సార్లు ప్రతిపాదనలను తీసుకువెళితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తిరస్కరించారు. అప్పుడు వడ్డీ మాఫీకే అంగీకరించని ఆయన ఇప్పుడు అసలు కూడా లేకుండా ఉచితంగా ఇస్తామంటూ మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వడ్డీతో పాటు అసలును మాఫీ చేసి లబ్ధిదారులకు వారి ఆస్తిపై శాశ్వత హక్కును కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ను తీసుకువచ్చింది. ఓటీఎస్‌తో ప్రభుత్వానికి వచ్చేది మూడు నాలుగువేల కోట్ల రూపాయలే. సంక్షేమ పథకాలకు రూ.వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం ఈ మూడు నాలుగు వేల కోట్ల కోసం కక్కుర్తి పడుతుందా? అయినా ఓటీఎస్‌కు సహాయ నిరాకరణ చేయండంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఎలా ప్రతిస్పందించాలో ప్రజలే ఆలోచించాలి...’అని సజ్జల పేర్కొన్నారు. * వైసీపీ డీఎన్‌ఏలోనే అంబేడ్కర్ భావజాలం ఉందని, అందుకు కారణం సీఎం జగన్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో సజ్జల పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







