కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిబ్బంది వెంటనే స్పందించాలని, ప్రమాద రహిత జిల్లా లక్ష్యంగా చేసుకోవాలని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సూచించారు. జిల్లాలోని అధికారులు, సిబ్బందికి ఐఆర్‌ఏడీ యాప్‌పై అవగాహన, రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో క్షతగాత్రులకు అందించే ప్రథమ చికిత్స, సీపీఆర్‌లపై వారం రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ మంగళవారంతో ముగిసింది. 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ఐఐటీ చెన్నై, భారత రహదారులు మంత్రిత్వశాఖ, ఎన్‌ఐసీఎస్ సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన ఐఆర్‌ఏడీ యాప్‌పై అవగాహన కల్పించారు. జీజీహెచ్ ఆర్‌ఎంవో డా.సుధీర్, డా.నూకరాజు సీపీఆర్ విధానాలపై అవగాహన కల్పించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటబుద్ధ, డా.ఎస్‌ఎస్‌సీ చక్రరావు, వి.వెంకట్, జీవీ రామారావు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







