ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

UPDATED 8th AUGUST 2019 THURSDAY 8:00 PM

పెద్దాపురం: పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం తహసీల్దార్ కె. పద్మావతి తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు స్పెషల్ సమ్మర్ రివిజస్-2020కు ఎన్నిక సంఘం అనుమతి ఇచ్చిందని, 2020 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఆధారాలు చూపించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు వారి బూత్ స్థాయిలో ఇంటింటికి తిరిగి ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ అధికారులకు సహకారం అందించి అర్హులైన ఓటర్లుగా నమోదు ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో చిన్నారావు, పెద్దాపురం, సామర్లకోట డిప్యూటీ తహసీల్దార్లు టి. కృష్ణారావు, శ్రీనివాస్, గోపు మురళి, సంగినీడి భావన్నారాయణ, సేపేని సురేష్ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ), తోటకూర శ్రీనివాస్ (తెలుగుదేశం పార్టీ), వి.వి. రమణ(భారతీయ జనతా పార్టీ), నీలపాల సూరిబాబు, కంచుమర్తి కాటంరాజు (సిపిఎం), పెద్దిరెడ్ల సత్యనారాయణ, బోడుకొండ (సీపీఐ), తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us