కాకినాడ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఉద్యోగ ఐకాస రాష్ట్ర ఐక్యవేదిక పిలుపులో భాగంగా వేతన సవరణ అమలు, డీఏ బకాయిల విడుదల, సీపీఎస్ రద్దు, ఇతర సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లాలోని 21 తాలూకా యూనిట్లలో ఉద్యోగులు నిరసన ప్రదర్శనలతో కదం తొక్కారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదిక బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తాలూకా యూనిట్ల కార్యవర్గాల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. కాకినాడలో ఐకాసల ఆధ్వర్యంలో స్థానిక మెక్లారిన్ ఉన్నత పాఠశాల నుంచి ఫులె విగ్రహం, బాలాజీచెరువు, జీజీహెచ్, జడ్పీ కూడలి, ఇంద్రపాలెం వంతెన, కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా సాగారు. కలెక్టరేట్ వద్ద నిరసన తెలపాలని ఉద్యోగులు భావించినా, ఆంక్షల నేపథ్యంలో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి ప్రదర్శనగా మళ్లీ మెక్లారిన్ పాఠశాల వద్దకు వచ్చారు. ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు దాచుకున్న రూ.1,600 కోట్లను దారి మళ్లించారనీ, దీంతో పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక, చదవించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు త్రినాథరావు, మూర్తిబాబు, దుర్గాప్రసాద్, వెంకట్రాజు, వెంకట రమణ, రవికుమార్, వై.పద్మమీనాక్షి తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సోమవారం రాజమహేంద్రవరంలో ద్విచక్రవాహన ర్యాలీ, మానవ హారం నిర్వహించారు. సబ్‌కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినదించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







